Gukesh: ధోనీని చూసే ఆ విషయం నేర్చుకున్నా..! 7 d ago

టీమిండియా మాజీ కెప్టెన్ MS ధోనీని చూసే ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఉండటాన్ని నేర్చుకున్నానని ప్రపంచ చెస్ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ తెలిపారు. ఒత్తిడిలో ఎలా ఉండాలనే విషయంలో ధోనీనే తనకు స్ఫూర్తి అని అన్నారు. అన్నింటికీ ఎక్కువగా స్పందించనని, ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొనగలనని.. తన కెరియర్ పై ధోనీ ప్రభావం ఎంతో ఉందన్నారు. 2011 ప్రపంచకప్ ఫైనల్ లో ధోనీ సిక్సర్‌తో మ్యాచ్ ను ముగించిన తీరు తనకు ఎప్పుడూ గుర్తుంటుందన్నారు. గతేడాది డంగ్ లీరెన్ పై గెలిచి ప్రపంచ ఛాంపియన్ విజేత గుకేశ్.. భారత్ తరపున విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఆ ఘనత దక్కించుకున్న ఆటగాడిగా రికార్డులకెక్కాడు.